
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన డార్లింగ్ తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab), ప్రశాంత్ నీల్ తో సలార్-2, నాగ్ అశ్విన్.. కల్కి పార్ట్-2, హనురాఘవపూడితో ఓ సినిమా (ఫౌజీ), సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ (Spirit) చిత్రాలున్నాయి. ఇలా లైన్ లో ఐదు సినిమాలతో ప్రభాస్ క్యాల్షీట్లన్నీ నిండిపోయాయి.
బిజీ బిజీగా డార్లింగ్ ప్రభాస్
ఓవైపు సినిమాలతో బిజీగా ఉండే ప్రభాస్ (Prabhas Movies) సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. కానీ డార్లింగ్ కు సంబంధించి నెట్టింట మాత్రం ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అలా ప్రభాస్ లైమ్ లైటులో లేకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం నిత్యం డార్లింగ్ ను వార్తల్లోనే ఉంచుతుంటారు. అయితే సినిమాల పరంగా కాకుండా ప్రభాస్ పై అభిమానులకు చాలా ఏళ్ల నుంచి ఓ కంప్లైంట్ ఉన్న విషయం తెలిసిందే. అదేంటంటే..?
కనిపిస్తే చాలు రిక్వెస్టులు
తమ డార్లింగ్ హీరో ప్రభాస్ (Prabhas Marriage)ను పెళ్లికొడుకుగా చూడాలని ఆయన అభిమానులు చాలా ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం చేతిలో ఐదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ మాత్రం మ్యారేజ్ గురించి అస్సలు ఆలోచించడం లేదు. అందుకే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏదైనా ఈవెంట్లో కనిపిస్తే చాలా డార్లింగ్ కు త్వరగా పెళ్లి చేయండంటూ ఫ్యాన్స్ వాళ్లకు రిక్వెస్టులు పెడుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
ప్రభాస్ సిస్టర్స్ ఫొటో వైరల్
రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) సోదరుడి తమ్ముడే ప్రభాస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కృష్ణంరాజు, శ్యామలా దేవి దంపతులకు ముగ్గురు కూతుళ్లు (ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి) ఉన్నారు. ప్రభాస్ తన ముగ్గురు చెల్లెళ్ల తో చాలా క్లోజ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తాజాగా శ్యామలా దేవి, తన ముగ్గురు కుమార్తెలతో కలిసి బంధువుల వేడుకకు వెళ్లారు. అక్కడ వాళ్లు కలిసి ఫొటోలు దిగారు. ఇప్పుడు ప్రభాస్ చెల్లెళ్లు దిగిన ఈ ఫొటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
డార్లింగ్ కు పెళ్లి చేయండి
అయితే ఈ కార్యక్రమంలో ప్రభాస్ కూడా పాల్గొనాల్సి ఉండగా షూటింగులో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయాడట. అయితే ఈ వేడుకకు వెళ్లిన ప్రభాస్ సిస్టర్స్ ఫొటో (Prabhas Sisters Photo) ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చాలా కాలం తర్వాత రెబల్ సిస్టర్స్ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా రావడంతో అందరి దృష్టిన ఆకర్షించారు. అయితే ఈ ఫొటోల కింద డార్లింగ్ అభిమానులు ప్రభాస్ చెల్లెళ్లకు రిక్వెస్టుల మీద రిక్వెస్టులు పెడుతున్నారు. చెల్లెమ్మలూ త్వరగా మా డార్లింగ్ కు పెళ్లి చేయండమ్మా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…