Video Viral : గుండెలు బాదుకుంటున్న ఈ రైతు గోస చూస్తే కన్నీళ్లు ఆగవు

రెండు లక్షలు అప్పు చేసి మిరప పంట వేస్తే పంట బాగా పండింది. దిగుబడి ముబ్బడిగా వచ్చింది.. ఇక లాభాలే లాభాలు అనుకున్నాడు ఆ రైతు. మిరపకాయలు కూడా పొడుస్తున్న పొద్దులాగా ఎర్రగా ఉండటంతో కాయ నాణ్యత మెరుగ్గా ఉండటంతో ఈసారి లాభాల పంట పండినట్టేనని భావించాడు ఆ అమాయక కర్షకుడు. ఎంతో ఆశగా పంటను అమ్ముదామని వ్యవసాయ మార్కెట్ కు వెళ్లాడు. ఇక అప్పులు తీరినట్టేనని భావించాడు. పిల్లల చదువుకు ఢోకాలేదని అనుకున్నాడు.

రైతు వెన్నిరిచిన సర్కారు

పంట అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో కూలీలకు పోను, ఖర్చులన్నీ పోగా.. డబ్బు మిగులుతుందని ఆశించాడు. ఈసారైనా తమ ఇంటి మనిషికి ఓ పట్టుచీర కొందామనుకున్నాడు. పిల్లలకు కొత్త బట్టలు తీసుకెళ్దామనుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్టు ఆ రైతు ఆశలన్నీ అడియాశలైపోయాయి. రెండు లక్షలు అప్పు చేసి పంట పండిస్తే కనీసం ఆ అప్పులు తీరేలా రెండు లక్షలన్నా రావా అని ధీమాగా ఉన్న ఆ కర్షకుడి వెన్నెముక విరిచేసింది ప్రస్తుత ప్రభుత్వం.

కళ్లలో కారం కొట్టారు కదయ్యా

రెండు లక్షలతో ఆరుగాలం పండించిన పంటను రెండు, మూడు వేలకు అమ్మేసి వెళ్లమని వ్యవసాయ అధికారులు చెబుతుండటంతో ఆ రైతు గుండె పగిలినంత పనైంది. ఇప్పుడు ఆ పంటకు కనీసం లక్ష రూపాయలు కూడా వచ్చేలా లేవని ఆ కర్షకుడు గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ‘ఆరు నెలలు కళ్లు కాయలు కాచేలా కాపలా కాస్తూ చంటిబిడ్డను సాకినంత జాగ్రత్తగా పంట పండిస్తే చివరకు మా కళ్లలో కారం కొట్టారు కదయ్యా’ అంటూ అధికారుల ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు ఆ రైతు.

కూలీ ఖర్చులకు కూడా రాలే

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరం గ్రామానికి చెందిన రైతు తాను పండించిన మిరప పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. అయితే క్వింటాకు రెండు, మూడు వేల రూపాయలు మాత్రమే ధర పలుకుతుండటం చూసి ఆ కర్షకుడు ఖంగుతిన్నాడు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండిస్తే కనీసం కూలీల ఖర్చులకు కూడా డబ్బు రావడం లేదని వాపోయాడు. ఇప్పుడు తానేం చేయాలంటూ గుండెలు బాదుకున్నాడు.

నేనెలా బతికేది?

అప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నాయని, తనకు ఇద్దరు ఆడబిడ్డలున్నారని, వాళ్లనెలా పోషించాలో అర్థం కావడం లేదంటూ బోరున విలపించాడు. ఇక నాకు పురుగుల మందే శరణమంటూ రోదించాడు. ప్రభుత్వం స్పందించి మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ రైతు గుండెలు బాదుకుంటూ తన గోస వెల్లబోసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రేవంత్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మనసులేని ముఖ్యమంత్రికి ఈ కర్షకుడి గోస వినిపించడం లేదా ?.. కనికరం లేని కాంగ్రెస్ సర్కారుకు ఈ రైతు బాధ కనిపించడం లేదా ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మీరు చెప్పిన మార్పు ఇదేనా?

మాయమాటలు నమ్మిన పాపానికి.. మిర్చి రైతు కంట్లో కారం కొడతారా.. ? ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా.. ? ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా.. ? వ్యవసాయ మంత్రి ఇలాకాలోనే..
గిట్టుబాటు ధర లేకపోతే రైతులేం కావాలె.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నా ఏం చేసుకోవాలె.. బోనస్ పేరిట బోగస్ మాటలు ఆపండి.. మిర్చి రైతుకు కనీసం మద్దతు ధర ఇప్పించండి. అంటూ బీఆర్ఎస్ నేతలు రైతుకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

Related Posts

KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’

‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…

గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు

ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖలో (Revenue Department) కొత్తగా ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. మొత్తం 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *