మరణంలోనూ వీడని స్నేహం.. వీళ్లగాథ వింటే కన్నీళ్లు తప్పవు

హైదరాబాద్‌ నాచారంలోని కార్తికేయనగర్‌ కాలనీ అధ్యక్షుడు సూరకంటి మల్లారెడ్డి(64), రాంపల్లి రవికుమార్‌(56), బోరంపేట్‌ సంతోష్‌ కుమార్‌(47), శ్రీరాం బాలకృష్ణ(62),  తార్నాక గోకుల్‌నగర్‌ నివాసి టీవీ ప్రసాద్‌(55), మల్లేశ్.. ఈ ఆరుగురు ప్రాణస్నేహితులు. నిత్యం తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నా వారానికోసారైనా కలుసుకుంటారు. కుటుంబాలతో కలిసి వారాంతాల్లో సరదాగా గడుపుతుంటారు. ఇక వీలు చూసుకుని ప్రతి ఏడాది స్నేహితులంతా కలిసి ఏదైనా ఓ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్తుంటారు.

ఈ సంవత్సరం మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసి అక్కడికి వెళ్లాలని నెలరోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. కానీ అందులో ఓ మిత్రుడు (మల్లేశ్) పలు కారణాల వల్ల ఈ విహారయాత్రకు వెళ్లలేకపోయాడు. మిగతా ఐదుగురు ఇంకో ముగ్గురి (రాఘవేంద్రనగర్‌ నివాసి సోమవరం శశికాంత్‌(37), మూసారాంబాగ్‌కు చెందిన కన్సారి ఆనంద్‌కుమార్‌(47), చైతన్యపురికి చెందిన సుంకూజు నవీన్‌ కుమార్‌(45))తో శనివారం రోజున కలిసి కుంభమేళాకు వెళ్లారు. మహాకుంభమేళాను సందర్శించి పుణ్యస్నానం చేసి తిరుగుప్రయాణమయ్యారు.

మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా సిహోరా ప్రాంతంలో అపసవ్య దిశలో దూసుకొచ్చిన సిమెంట్‌ బస్తాల లారీ గుంతలో పడి.. ఎగిరి వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సుపై పడింది.  టెంపో నుజ్జునుజ్జు కావడంతో ఈ ఘటనలో మినీ బస్సులో ఆరుగురితో పాటు లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతుల్లో మల్లారెడ్డి, సంతోశ్, రవికుమార్, టీవీప్రసాద్ నలుగురు ప్రాణస్నేహితులు. మరో మిత్రుడు శ్రీరాం బాలకృష్ణ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆఖరి నిమిషం విహారయాత్రకు వెళ్లకపోవడంతో మల్లేశ్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.

అయితే ఒకేసారి నలుగురు మిత్రులు ప్రాణాలు కోల్పోవడంతో కార్తికేయనగర్ లో  విషాదఛాయలు అలుముకున్నాయి. తన నలుగురు మిత్రులను కోల్పోయిన మల్లేశ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. మల్లాపూర్ వైకుంఠధామంలో వీరి అంత్యక్రియలు జరిగాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రవికుమార్ కుమార్తె నిశ్చితార్థం ఈనెల 17వ తేదీన జరగాల్సి ఉంది. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఇప్పుడు ఆ కుటుంబమంతా గుండెలవిసేలా రోదిస్తోంది. మరోవైపు సంతోశ్ కుమార్ భార్య ఏడాది క్రితం మరణించగా.. ఈ ప్రమాదంలో అతడి మరణంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. ఒక్క ప్రమాదం ఎంతో మంది కుటుంబాలను ఇప్పుడు ఛిన్నాభిన్నం చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *