
బంగారం ధర(Gold Rate) రోజురోజుకూ అందనంత పైకి చేరుకుంటోంది. ఇప్పటికే చేరుకున్న రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి(Silver Price) ధరలు ఇంకా మరింత ఎగబాకే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు(Market Analysts) చెబుతున్నారు. గ్రాము బంగారం కొనుగోలు చేయడం కూడా ఇప్పుడు సామాన్యుడికి కష్టంగా మారింది. 10 గ్రాముల బంగారం ధర తొంభై వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర రూ. లక్షా పద్నాలుగు వేలు పలుకుతోంది. ఇలా పెరుగుతూ పోతే ఇక బంగారాన్ని కొనుగోలు చేయడం గగనమే అంటున్నారు సామాన్యులు. అటు ధరలు తగ్గే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదని వ్యాపారులు అంటున్నారు.
70 శాతం మేర పడిపోయిన అమ్మకాలు
ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా అమ్మకాలు(Sales) దారుణంగా పడిపోయాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. గతంతో పోల్చుకుంటే బంగారం, వెండి అమ్మకాలు 70 శాతం మేరకు పడిపోయినట్లు తెలిపాయి. రాను రాను ఇంకా ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, అసలు బంగారు దుకాణాల(Jewellery Shops) మనుగడ కష్టంగా మారుతుందన్న కామెంట్స్ కూడా వినిపడుతున్నాయి.
ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు(మార్చి 20) దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపించింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market) లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.10 పెరిగి రూ.82,910 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.10 పెరిగి రూ. 90,440 వద్ద కొనసాగుతోంది. కేటీ వెండి రేటుపై రూ.100 పెరిగి రూ.1,14,100 వద్ద ట్రేడవుతోంది.