గతవారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు(Gold Rates) మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ రోజు (ఆగస్టు 23) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితులు, డాలర్ విలువలో క్షీణత, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో ఈ ధరలు పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 పెరిగి రూ.1,01,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,000 ఎగబాకి రూ.93,150 పలుకుతోంది.

కేజీ వెండిపై రూ.2,000 పెరుగుదల
అటు కేజీ వెండి(Silver)పై రూ.2,000 పెరిగి రూ.1,20,000గా ఉంది. విజయవాడ(Vijayawada), విశాఖపట్నం, చెన్నై వంటి నగరాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. అంతర్జాతీయంగా వెండి ఫ్యూచర్ ధర ఔన్సుకు $39.63 వద్ద ట్రేడ్ అవుతోంది. పండుగల సీజన్(Festival Season) సమీపిస్తుండటం, పారిశ్రామిక డిమాండ్ పెరగడం వెండి ధరల పెరుగుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనుగోలుదారులు ధరల ఒడిదుడుకులపై దృష్టి సారించాలని, కొనుగోలు ముందు స్థానిక ధరలను ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు.






