Passport: విజయవాడ నుంచే పాస్‌పోర్ట్‌ పొందే అవకాశం.

మన ఈనాడు:

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇది గుడ్‌న్యూస్‌ . ఉన్నతచదువులు, ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్లేవారు పాస్‌ పోర్ట్‌ చేయించుకోవాలంటే విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు విజయవాడలోనూ పాస్‌పోర్ట్‌ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చేస్తుంది. అవును, 2024 జనవరి నుండి విజయవాడలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభించనున్నారు. అయితే ఇంతకుముందే విజయవాడలో పాస్‌పోర్ట్‌ ఆఫీసు ఉన్నప్పటికీ అది కేవలం సేవాకేంద్రంగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఈ కార్యాలయం పూర్తిస్థాయి సేవలు అందించనుంది.

ఇకపై పాస్ పోర్ట్ ప్రింటింగ్, డిస్పాచ్ కుడా ఇక్కడినుంచే పొందవచ్చు. విజయవాడ గవర్నర్ పేట లోని ఏజి ఆఫీస్ కాంప్లెక్స్‌లో వచ్చే ఏడాది నుండి కొత్త పాస్ పోర్ట్ ఆఫీస్ ప్రారంభం కానుంది. పాస్ పోర్ట్ ప్రింటింగ్, డిస్పాచ్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ పాలసీకి సంభందించిన సేవలు కూడా విజయవాడనుంచే పొందవచ్చు. ఇప్పటి వరకు 15 జిల్లాలకు చెందిన ప్రజలకు విజయవాడ, తిరుపతి పాస్ పోర్ట్ ఆఫీస్ ల నుండి 13 పోస్ట్ ఆఫీస్ సేవా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు. మిగిలిన జిల్లాకు విశాఖలోని పాస్‌పోర్ట్‌ ఆఫీస్ సేవలను అందిస్తుంది. ఇప్పుడు విజయవాడలో కొత్త కార్యాలయం అందుబాటులోకి రావడంతో స్లాట్‌ బుకింగ్‌లో టైమ్‌ సేవ్‌ అవుతందని అంటున్నారు అధికారులు.

Share post:

లేటెస్ట్