ఇప్పుడు టోల్ ప్లాజాల విషయంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తోంది. ప్రయాణికుల(Vehicle Owners) భాద్యతలను తగ్గించేందుకు తాజాగా మరో సరికొత్త టోల్ సౌకర్యాన్ని ప్రారంభించింది. మీరు టోల్ ప్లాజా(Toll Plaza) చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తే, నెలవారీ పాస్(Monthly pass) తీసుకుని టోల్ గేట్ నెలకు ఎన్ని సార్లు అయినా దాటి వెళ్లవచ్చు. అదనంగా టోల్ చెల్లించాల్సిన(Toll Payments) అవసరం ఉండదు.
20 కి.మీ పరిధిలోనివారికి నో టోల్ ఫీ!
ఈ సౌకర్యాన్ని పొందాలంటే ముందుగా రూ.340 పాస్ తీసుకోవాలి. దీనితో నెల రోజులు పాటు టోల్ ప్లాజా వద్ద అనేక సార్లు ప్రయాణించవచ్చు. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ డెడక్షన్ కూడా జరగదు. అయితే, వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు.
ఈ పాస్ తీసుకోవాలంటే ఏమి చేయాలి?
మీ చిరునామా 20 కి.మీ లోపల ఉన్నదని రుజువు చేసే పత్రాలు (ఆధార్, ఓటర్ ఐడి, విద్యుత్ బిల్లు), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫోటో, చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. మీరు టోల్ ప్లాజా వద్దకు వెళ్లి దరఖాస్తు ఫారమ్ తీసుకుని నింపాలి. అవసరమైన పత్రాలతో పాటు రూ.340 చెల్లించాలి. ఆపై మీ ఫాస్టాగ్ అకౌంట్‌కి లింక్ చేస్తారు లేదా పాస్ కాపీ ఇస్తారు.
GNSS ఆధారిత వ్యవస్థ:
“జిత్నీ దూరీ ఉత్నా టోల్” విధానం కింద GNSS (లొకేషన్ ట్రాకింగ్ టెక్నాలజీ) వాడి 20 కి.మీ లోపల ప్రయాణిస్తే టోల్ రుసుములు మినహాయించబడతాయి. జూలై 2024 నుంచి ఈ కొత్త టోల్ విధానం కొన్ని రహదారులపై పైలట్ ప్రాజెక్టుగా అమలు అవుతోంది. ఈ విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాస్ విధానం సాధారణ ప్రయాణికులకు గణనీయమైన మినహాయింపు ఇస్తోంది.






