
తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థుల(School Students)కు తీపికబురు వచ్చేసింది. చిన్నారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హాఫ్ డే స్కూల్స్(Half Day Schools) నేటి (మార్చి 15) నుంచి కొనసాగనున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు(Summer Temperatures)రోజురోజుకీ పెరిగిపోతుండటంతో AP, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఒకపూటే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అన్నింటికీ వర్తించనున్నాయి.
విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు
కాగా తెలంగాణ(Telangana)లో హాఫ్ డే స్కూళ్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అలాగే ఏపీలో ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకూ జరుగుతాయి. ఉక్కపోత, వేడి గాలులకు విద్యార్థుల ఇబ్బందులు పడకుండా.. వారి సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంటిపూట బడులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 12 నుంచి 2025-26 విద్యా సంవత్సరం(New Academic Year) ప్రారంభం కానుంది.
ఒక్కో పీరియడ్ ఎంతసేపు ఉంటుందంటే..
కాగా ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా ఒంటిపూట బడుల నేపథ్యంలో ఒక్క క్లాస్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనే వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గం.లకు 1వ బెల్, 8:05కు 2వ బెల్, 8:15- 8:55 వరకు 1వ పీరియడ్, 8:55- 9:35 వరకు 2వ పీరియడ్, 9:35- 10:15 వరకు 3వ పీరియడ్, 10:15- 10:30 గంటలకు బ్రేక్. 10:30 గం. నుంచి 11:10 వరకు 4వ పీరియడ్, 11:10 గం. నుంచి 11:50 వరకు 5వ పీరియడ్, 11:50 గం. నుంచి 12:30 వరకు చివరి పీరియడ్ ఉంటుందని తెలిపారు.