
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్‌కు మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. పవన్-క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కాంబోలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’. ఇటీవల ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్(First Single) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ స్పెషల్ అప్డేచ్ ఇచ్చారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టినాదిరో(Kollagottinadiro)’ అంటూ సాగే పాటను ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
Happy Valentine’s Day from #HariHaraVeeraMallu ❤️
Get ready to groove with the one and only Powerstar @PawanKalyan 🤩#HHVM 2nd single is coming to STEAL YOUR HEART! 🫶🏻#Kollagottinadhiro – #UdaaKeLeGayi – #EmmanasaParichutta – #KaddhukonduHodhalo – #EnManasuKattavale
Mark… pic.twitter.com/gU4GMBb68y
— Hari Hara Veera Mallu (@HHVMFilm) February 14, 2025
పవన్ పాటకు సూపర్ రెస్పాన్స్
కాగా ఈ సినిమాలో పవన్ స్వయంగా పాడిన ‘మాట వినాలి.. గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి’ అనే సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు-1 ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్(Harihara Veeramallu-1 The Sword vs Spirit)’ ఈ ఏడాది మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. MM కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్‌పై AM రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.