Hardik Pandya Ruled Out of World Cup: పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండ గాయంతో హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన తర్వాత అతను నాకౌట్ గేమ్‌లకు ఫిట్‌గా ఉంటాడని అంతా భావించారు.
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన గాయం నుంచి కోలుకోలేకపోవడంతో స్వదేశంలో జరిగే ICC ODI ప్రపంచ కప్ 2023లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా, హార్దిక్ స్థానంలో సీమర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎంపికయ్యాడు. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే పోరుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది.
పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండ గాయంతో హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన తర్వాత అతను నాకౌట్ గేమ్‌లకు ఫిట్‌గా ఉంటాడని అంతా భావించారు.
సీమ్-బౌలింగ్ ఆల్-రౌండర్‌గా జట్టు బ్యాలెన్స్ అందిస్తోన్న హార్దిక్.. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ ఐదు వికెట్లు తీశాడు.
“గత నెలలో పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని ఎడమ చీలమండకు గాయమైంది. మిగిలిన మ్యాచ్‌ల్లో కోలుకుంటాడని అంతా భావించాం. కానీ, ఈ 30 ఏళ్ల ఆల్ రౌండర్ కోలుకోవడంలో విఫలమయ్యాడు” అంటూ ఐసీసీ సమాచారమిచ్చింది.
జట్టుతో చేరనున్న కర్ణాటక పేసర్..
భారత్ తరపున ప్రసిద్ధ్ కృష్ణ 17 వన్డేలు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పేసర్ చివరిసారిగా ఆడాడు. 27 ఏళ్ల అతను ఆదివారం కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో తమ తదుపరి మ్యాచ్‌లో భారత జట్టులో భాగం కానున్నాడు.
తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లతో షమీ 2023 ప్రపంచకప్‌లో దూసుకపోతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, షమీ, జడేజా, కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం ఈ ప్రపంచ కప్‌లో అత్యంత విధ్వంసకర బౌలింగ్ అటాకింగా మారారు.
ఇప్పటి వరకు టీమిండియా ఆడిన 7 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ.