పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రెడీ.. విడుదలకు రంగం సిద్ధం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత, ఆయన నుండి కొత్త సినిమాలు రాలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu )ఎట్టకేలకు విడుదల దశకు చేరుకుంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం తాజాగా ట్రైలర్ విడుదల దశలోకి వచ్చేసింది.

‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్ట్‌ 2019లో మొదలైంది. కానీ కరోనా మహమ్మారి, పవన్ రాజకీయ కమిట్‌మెంట్లు, షూటింగ్ జాప్యాల కారణంగా ఈ సినిమా చాలాకాలంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పని చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. స్క్రీన్‌ప్లే రచయిత జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్ట్‌కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. 17వ శతాబ్దం మొఘల్ యుగంలో సెటింగ్ ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు. ఇందులో పవన్ ఒక పోరాట యోధుడిగా, రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. పాత్రకు తగ్గట్టుగా ప్రత్యేక శిక్షణ తీసుకొని పవన్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు.

తాజాగా ట్రైలర్ ఫైనల్ కట్ పూర్తయినట్లు సమాచారం. మొదట రిలీజ్ డేట్(Release Date) ఖరారు కాలేదని ట్రైలర్‌(Trailar)ను హోల్డ్‌లో పెట్టిన చిత్ర బృందం, ఇప్పుడు జూన్ నెలాఖరులో ట్రైలర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారని టాక్. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్స్‌కు భారీ స్పందన లభించిన నేపథ్యంలో, ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarval) కథానాయికగా నటిస్తోంది. ఎంఎం కీరవాణి(MM kiravaani) సంగీతం అందిస్తున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో నిర్మితమవుతోన్న ఈ చిత్రం, పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా జూలై 24, 2025న థియేటర్లలోకి రానుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో, ఆయన సినిమా ప్రమోషన్స్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది. అయినప్పటికీ, ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా మీద క్రేజ్ మళ్ళీ ఊపందుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *