
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలున్న విషయం తెలిసిందే. అందులో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఒకటి. తేరీ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో ఫ్యాన్స్ కోసం హరీశ్ శంకర్ (Harish Shankar).. ఊహించని సర్ ప్రైజ్ లు, భారీ ఎలివేషన్స్ ఇస్తున్నానని తరచూ హింట్స్ ఇస్తూ జోష్ నింపుతున్నాడు. ఇటీవలే హిందీ మూవీ రెయిడ్ ను మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)’ ఎలా ఉంటుందోనని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఓజీ (OG Movie), హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓజీ సినిమాకే బజ్ ఎక్కువ. ఇక హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కావడంతో దీనికి చాలా తక్కువ ఇంపార్టెంట్స్ ఉంది. అయినా ఈ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసేందుకు హరీశ్ శంకర్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ డైరెక్టర్ గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా అలాగే హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న హరీశ్ శంకర్ ఈ చిత్రం గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ సీన్ ఒకటి రీక్రియేట్ చేయనున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపుపై కూర్చోగా ఆయన వెనక అభిమానులు, జనసేన కార్యకర్తలు బైకులు, కార్లలో ఫాలో అయిన వీడియో ఒకటి బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రియల్ సీన్ ను ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో రీ క్రియేట్ చేయాలని హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఇక పూనకాలే.