Ustaad Bhagat Singh: ఉస్తాద్​ భగత్​‌సింగ్​ నుంచి అదిరిపోయే అప్​డేట్​

గబ్బర్​సింగ్​ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్’(Ustaad Bhagat Singh). కాగా ఈ మూవీకి సంబంధించి హరీశ్​ శంకర్ (Harish Shankar)​ మరో అప్​డేట్​ ఇచ్చారు. పవన్‌కు సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్​ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్​ చేస్తూ ‘మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం.. మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే’ అంటూ పోస్ట్​ పెట్టారు. ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. పవన్ ఎనర్జీ సినిమాకు మరింత పవర్​ ఇచ్చిందని, సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

‘గబ్బర్​ సింగ్’ లాంటి బ్లాక్​ బస్టర్​ హిట్​ తర్వాత పవన్​–హరీశ్​ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్​సింగ్​ లాంటి విజయం దక్కాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు. గబ్బర్​ సింగ్​ తరహాలోనే ఉస్తాద్​ లోనూ పవన్​ పోలీస్​ గెటప్​ లో నటిస్తుండడంతో ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్​ అందిస్తున్నారు. శ్రీలీల (Sreeleela), రాశీ ఖన్నా (Rashi Khanna) హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తునారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *