స్పేస్ స్టేషన్‌ నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్.. LIVE ఇదిగో!

దాదాపు 9 నెలల తర్వాత భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్(Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(Butch Wilmore) మరికొన్ని గంటల్లో భూమిమీదకు చేరుకోనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం అంతరిక్ష నౌక ‘డ్రాగన్’ అన్ డాకింగ్(Dragon undocking)’ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిని నాసా లైవ్ టెలికాస్ట్(NASA Live Telecast) చేస్తోంది. కాగా సాయంత్రం ‘డ్రాగన్’ భూమికి ప్రయాణం మొదలుపెడుతుంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 3:27 గంటలకు ఫ్లోరిడా తీరానికి దగ్గరలో ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరుగా ఆస్ట్రొనాట్లు(Astronauts) బయటికి వస్తారని నాసా వెల్లడించింది.

రేపు ఉదయం ల్యాండ్ అవుతారు..

కాగా ఈ మేరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(INS) నుంచి క్రూ10 రాకెట్ విడిపోయింది. బుధవారం తెల్లవారుజామున 2.41 నిమిషాలకు క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. బుధవారం ఉదయం 3.27 నిమిషాలకు ఫ్లోరిడా(Florida)లో ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉంది. సముద్రంలో ల్యాండ్‌ అవనుండడంతో రెస్య్కూ చేయనున్నారు. ఉదయం 8.15గంటల తర్వాత హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్ సెంటర్‌(Johnson Space Center in Houston)కు సునీతా బృందం చేరుకుంటుంది. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడపడంతో వారి శారీరక పరిస్థితిపై డాక్టర్లు పర్యవేక్షిస్తారు.

భూమ్మీదకు వచ్చాక నడవలేరు..

భూమిపై అడుగుపెట్టాక వాళ్లు నడవలేరు. నెలల పాటు ఎక్సర్​సైజ్​లు చేయాల్సి ఉంటుంది. వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బందిపడొచ్చు. స్పేస్​లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. లో బీపీ, ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలూ ఎదురవుతాయని వైద్యులు తెలిపారు. కాగా సునీతా విలియమ్స్, విల్మోర్ భూమి మీదకు వస్తున్న LIVEను మీరూ చూడండి..

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *