జమ్మూకశ్మీర్(Jammu And Kashmir)లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న అనంతనాగ్ జిల్లాలోని పహల్గామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దీంతో భారీగా భద్రతా బలగాల(Security forces)ను జమ్ముూకశ్మీర్కు తరలిస్తున్నారు. మరోవైపు జమ్ముూకశ్మీర్లో మరోసారి ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు(Intelligence Agencies) హెచ్చరించాయి. భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇదిలా ఉండగా నిన్న జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారిని అధికారులు వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాలుగు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించగా.. మరో 20 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో విదేశీ టూరిస్టులు(Foreign Tourists) కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
#WATCH | J&K | Search operation underway in Pahalgam following the #PahalgamTerroristAttack.
(Visuals deferred by unspecified time.) pic.twitter.com/XAIwIBv6et
— ANI (@ANI) April 23, 2025
ఉరిలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి
భారత్-పాకిస్థాన్(India-Pak Boarder) సరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్లోని ఉరి సెక్టార్(Uri Sector) వద్ద నియంత్రణ రేఖ నుంచి ఇద్దరు, ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు(Pakistani Terrorists) భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని చొరబాటు యత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. మరోవైపు బారాముల్లా జిల్లాలోని ఉరిలో ఎన్కౌంటర్(Encounter) జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వారి వద్ద భారీగా ఆయుధాలు, పేలు పదార్థాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.
BREAKING : At least 12 Pakistani soldiers killed, 3 posts & 2 Artillery positions destroyed after Indian Army retaliated the ceasefire violation in Tatta Pani Sector. Heavy Artillery & Mortar shelling reported.(Sources)
More details soon #Pahalgam #PahalgamTerroristAttack pic.twitter.com/cepu3AJz0z
— Baba Banaras™ (@RealBababanaras) April 23, 2025
ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం
ఇదిలా ఉండగా జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో ప్రధాని మోదీ(PM Modi) సమావేశమై ఉగ్ర ఘటనపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి దాడి జరిగిన తీరును వివరించారు. కాగా, బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం(Cabinet Committee Meeting) జరగనుంది.








