టాలీవుడ్ నటుడు నేచురల్ స్టార్ నాని (Nani) తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ లో విభిన్న కథా చిత్రాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన బ్యానర్ లో ‘కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ (Court State Vs Nobody) అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. కోర్ట్ సినిమా చూసి అది నచ్చితేనే.. తన నెక్స్ట్ మూవీ హిట్-3 చూడండి అని కామెంట్స్ చేశారు.
కోర్ట్ నచ్చకపోతే హిట్-3కి రావొద్దు
ఇటీవల జరిగిన కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని (Nani Court Movie) మాట్లాడుతూ.. “కోర్ట్ మూవీ నచ్చకపోతే, నా ‘హిట్ 3 (HIT 3 : The 3rd Case)’ సినిమాను చూడక్కర్లేదు” అంటూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. అయితే ఈ కామెంట్స్ చూస్తుంటే తన సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నాడో తెలిసిపోతుందని నెటిజన్లు అన్నారు. మార్చి 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా పెయిడ్ ప్రీమియర్స్ తో థియేటర్లలో సందడి చేస్తోంది.
Naaa cinema safe !!!! #CourtStateVsANobody is an emotionally riveting movie that is absolutely necessary for everyone cos there is so much to take back home. So proud to be associated with @walpostercinema @tprashantii and my man @NameisNani. One more feather in… pic.twitter.com/e13JAGLEJa
— Sailesh Kolanu (@KolanuSailesh) March 12, 2025
నా సినిమా సేఫ్
అయితే కోర్ట్ ప్రీమియర్ ను హిట్ ఫ్రాంఛైజీ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) వీక్షించారు. అనంతరం ఆ సినిమాపై రివ్యూను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన రివ్యూతో కోర్ట్ మూవీపై శైలేష్ కొలను సూపర్ హైప్ క్రియేట్ చేశారు. “నా సినిమా (HIT 3) సేఫ్” అంటూ ఈ సినిమా గురించి ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి ఎమోషన్స్ తో సాగిన ఈ సినిమాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలని కోరారు. ఈ చిత్రం చాలా విషయాలపై అవగాహన కల్పిస్తుందని వెల్లడించారు.
#Nani – A man of his word, with unshakable confidence🔥#Hit3 chudataniki ready ga undandi!#Court #Priyadarshi pic.twitter.com/9zIYkVhEEU
— Filmyscoops (@Filmyscoopss) March 12, 2025
అందరూ చూడాల్సిన సినిమా
“నా సినిమా సేఫ్. కోర్ట్ చిత్రం ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న సినిమా. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు వీక్షించాలి. నా మిత్రుడు నాని, నిర్మాత ప్రశాంతి, దర్శకుడు జగదీష్, హీరో ప్రియదర్శి (Priyadarshi) అందరికీ కంగ్రాట్స్. ప్రియదర్శి కెరీర్‌లో మరో అద్భుతమైన పాత్ర ఇది. ఇప్పుడు మళ్లీ ఎడిట్ రూమ్‌లోకి వెళ్తున్నాను. అందరూ కోర్ట్ సినిమా చూడండి.” అంటూ శైలేష్ కొలను ట్వీటారు. ఈ డైరెక్టర్ ట్వీట్ తో ఇప్పుడు కోర్ట్ మూవీపై మరింత ఆసక్తి పెరిగింది.






