
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా (Rana) రూటే సపరేటు. హీరోయిజాన్ని నమ్ముకోకుండా కంటెంట్ ను నమ్మి సినిమాలు చేస్తూ ఉంటాడు. తన పాత్ర చిన్నదైనా సరే.. సినిమాలో తన క్యారెక్టర్ ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఓకే చెప్పేస్తాడు. డైరెక్టర్ కొత్త వాడైనా.. చిన్న దర్శకుడైనా.. కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. అందుకే రానా కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలకన్నా.. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువ. ఇక మొహమాటం లేకుండా.. చిన్నతనం అనుకోకుండా.. కథ నచ్చితే ఏ హీరోతో అయినా మల్టీ స్టారర్ కు ఓకే అనేస్తాడు.
రానా కలల ప్రాజెక్టు
అలాంటి రానా సోలో హీరోగా తన కెరీర్ లో కొన్ని ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. మల్టీ స్టారర్ లలో మాత్రం మంచి హిట్లు అందించాడు. ఇక రానా తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఎప్పటికైనా తన కలల ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని పరితపించాడు. వాటిలో ఒకటి హిరణ్యకశిప. పురాణాలంటే ఎక్కువ మక్కువ చూపే రానా.. వాటిని నేటి తరానికి తెలియజేయాలని భావించాడు.
A storm unleashed. ❤️🔥
2 Million Views and counting for #MahavatarNarsimhaTeaser 💥
🔗 https://t.co/rvGS9YKU20#MahavatarNarsimha hits theatres worldwide on April 3rd, 2025.
Experience the Epic Battle between Good and Evil in 3D Animation.#Mahavatar @hombalefilms @VKiragandur… pic.twitter.com/JjLB5ZdluJ— Hombale Films (@hombalefilms) January 15, 2025
హిరణ్యకశిపకు ఏమైంది
ఇందులో భాగంగానే ‘హిరణ్యకశిప (Hiranyakashipa)’ సినిమా చేయాలనుకున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. యానిమేషన్ వర్క్ కూడా పూర్తయింది. డైరెక్టర్ గుణశేఖర్ (Guna Sekhar) కూడా ఓకే అయ్యాడు. ఇంతలో ఏమైందో తెలియదు. గుణశేఖర్ కు, రానాకు మధ్య ఏం జరిగిందో కానీ.. ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత ఇక ఈ చిత్రం గురించి రానా ఊసే ఎత్తలేదు. కానీ ఎప్పటికైనా ఈ సినిమా చేయాలనే కోరిక మాత్రం ఆయనలో బలంగా నాటుకుపోయింది.
When Faith is Challenged, He Appears.
In a World torn apart by Darkness and Chaos…Unleash the Fury!
Witness the Roar of #MahavatarNarsimhaTeaser: https://t.co/rvGS9YKU20Witness the Appearance of the most Ferocious, The Half-Man, Half-Lion Avatar-Lord Vishnu’s Most Powerful… pic.twitter.com/PdeGZThD9w
— Hombale Films (@hombalefilms) January 14, 2025
రాను ప్రాజెక్టు హైజాక్
అయితే ఇప్పుడు రానాకు షాక్ ఇచ్చింది కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films). రానా డ్రీమ్ ప్రాజెక్టును ఇప్పుడు ఈ సంస్థ హైజాక్ చేసింది. `మహావతార్ నరసింహ (Mahavatar Narsimha)` పేరుతో పురాణాల్లోని నరసింహ అవతారం గురించి ఈ సినిమా చేస్తున్నారు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యానిమేటెడ్ సిరీస్ గా రూపొందనుంది. ఇటీవలే టీజర్ కూడా రిలీజ్ చేశారు. కేజీఎఫ్, కాంతార, భగీరా తర్వాత హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఏప్రిల్ లో మహావతార్ నరసింహా చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది.