Honda Activa 7G: లేటెస్ట్ ఫీచర్స్‌తో హోండా యాక్టీవా 7జీ.. ధర ఎంతంటే?

Mana Enadu: స్కూటర్ లవర్స్‌(Scooter lovers)కు గుడ్‌న్యూస్. త్వరలో కొత్త యాక్టివా అందుబాటులోకి రాబోతోంది. అందుకే ప్రస్తుతం స్కూటర్ వెహికల్స్ కొనేలనుకునే వారు ఇంకొన్నాళ్లు ఆగితే బెటర్. ఎందుకంటే అదిరిపోయే ఫీచర్లతో Activa 7G మార్కెట్లోకి వస్తోంది. ప్రముఖ వెహికల్స్ బ్రాండ్ కంపెనీ హోండా(Honda) కస్టమర్లకు న్యూ టెక్నాలజీ, ఫీచర్స్‌తో రూపొందించిన వెహికల్‌ని అతి త్వరలోనే లాంచ్ చేయనుంది. 2001లో లాంచ్‌ అయిన హోండా యాక్టివా. ఇప్పుడు ఈ సిరీస్‌లోనే మోడర్న్‌ డిజైన్, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్ల పర్ఫెక్ట్‌(Perfect for modern design, advanced features) కాంబినేషన్‌తో లేటెస్ట్ ఎడిషన్ యాక్టివా 7G అందుబాటులోకి వస్తోంది. ఇది నగర ప్రయాణాలు, లాంగ్ హైవే రైడ్‌లు రెండింటికీ స్మూత్‌, కన్వీనియంట్‌గా ఉంటుందని సంస్థ ప్రకటిచింది. ఈ లేటెస్ట్‌ బైక్‌ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

 ఈ కొత్త మోడల్ ఫీచర్లు, ప్రత్యేకతలు

హోండా యాక్టివా 7G అధికారిక ధర(Price)ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. దీని ధర రూ.85,000 నుంచి రూ.90,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉండవచ్చని అంచనా. Delhiలో ఆన్-రోడ్ ప్రైస్‌ రూ.95,000 నుంచి రూ.1,00,000 వరకు ఉండవచ్చు. దీపావళి పండుగ సీజన్‌లో హోండా ఆకర్షణీయమైన లాంచ్ డీల్స్‌ అందించే అవకాశం ఉంది. ఇది కిక్, సెల్ఫ్‌ స్టార్ట్‌(Kick, self start) రెండు ఆప్షన్లతో వస్తుంది. వెహికల్ 110CC, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్కూటర్ 8BHP పవర్, 9NM టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌(Fuel injection system)తో వస్తోంది. ఈ స్కూటీ పర్యావరణ అనుకూలం, ఇంజిన్ BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

 మైలేజీ ఎంత ఇస్తుందంటే..

యాక్టివా 7G కీలక ఫీచర్లలో ఒకటి హోండా ఎన్‌హ్యాన్స్‌డ్‌ స్మార్ట్ పవర్ (eSP) టెక్నాలజీ. ఇది ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేటప్పుడు ఇంజిన్ పనితీరును ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ స్కూటరు లీటరుకు 55-60KMల మైలేజీని అందజేస్తుందని అంచనా. యాక్టివా 7G కన్వీనియన్స్‌, కనెక్టివిటీ కోసం రూపొందించిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో వస్తుంది. అత్యంత కీలక ఫీచర్లలో ఒకటి హోండా స్మార్ట్ కీ సిస్టమ్‌(Smart Key System)ని ఉపయోగించవచ్చు. ట్రిప్ మీటర్లు, సర్వీస్ రిమైండర్‌ల వంటి రియల్ టైమ్‌ ఇన్‌ఫర్మేషన్‌ డిస్‌ప్లే(Real time information display) చేస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ(Bluetooth connectivity) వంటి ఫీచర్లు ఉన్నాయి. రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్లను దీనికి కనెక్ట్ చేయవచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. మాట్ బ్లాక్, పెర్ల్ వైట్ వంటి షేడ్స్ నుంచి ఎలక్ట్రిక్ బ్లూ, రేడియంట్ రెడ్ వంటి కలర్స్‌లో లభిస్తుంది.

Share post:

లేటెస్ట్