ఈ-కామర్స్ సంస్థలు(E-commerce companies) పలు విధానాలను ఉపయోగించి వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. అందులో బై నౌ, పే లేటర్(Buy Now-Pay Later) బాగా ప్రాచుర్యం పొందింది. దీనివల్ల కస్టమర్స్(customers) తమ చేతిలో డబ్బు లేకపోయినా, నచ్చిన వస్తువుల(Items)ను కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత వాయిదా(Installments) పద్ధతిలో డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. అయితే సకాలంలో పేమెంట్స్(Payments) చేసినంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్ లేట్ అయినా, అమౌంట్ చెల్లించలేకపోయినా.. భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది.
ఫ్యూచర్‌లో వచ్చే నష్టాలను గమనించాలి..
ఎందుకంటే ఈ వస్తువును అనవసరంగా కొన్నానే.. అనే ఫీలింగ్ కలిగిస్తుంది. అందుకే BNPL ద్వారా వస్తువులను కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ‘ముందు కొనండి, తరువాత చెల్లించండి(Buy Now-Pay Later)’ అనేది మనకు ఆకర్షణీయంగానే అనిపించినా, దీని ద్వారా ఫ్యూచర్‌లో నష్టాలు కూడా ఉంటాయని గమనించాలి. ఇది మనకు ఆఫర్(Offer)లా అనిపించినా, నిజానికిది ట్రాప్(Trap) వంటిదే. తమ వస్తువుల కొనుగోళ్లు పెరగడానికి ఆయా సంస్థలు BNPL అనే వ్యూహాన్ని అమలుపరుస్తాయి. ఈ ఆఫర్ ఉందని మనం అవసరం లేని వస్తువును కూడా కొనుగోలు చేస్తుంటాం.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
☛ BNPL పద్ధతిలో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర సంస్థల సర్వీసులతో పోల్చుకొని, ఎక్కడ సౌకర్యంగా అనిపిస్తుందో అక్కడే వస్తువులు తీసుకోవాలి. ఈ సర్వీసులు పొందాలంటే క్రెడిట్ స్కోర్(Credit Score) అవసరం లేదు. కానీ సకాలంలో చెల్లింపులు చేయకపోతే క్రెడిట్ స్కోర్ ప్రభావితమవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో బ్యాంకు లోన్స్(Bank loans) రావడం కష్టం అవుతుంది.
☛ చెల్లింపులు ఆలస్యమైతే అదనంగా వడ్డీ కట్టాలి. అలాగే ఆలస్య రుసుములు వంటి భారీ పెనాల్టీ(Penalty)లు సైతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
☛ కస్టమర్లు వస్తువులు కొనేలా కొన్ని సంస్థలు టెంప్ట్ చేస్తుంటాయి. దీంతో అవసరం లేకపోయినా ఆ వస్తువులను కొనాలనుకుంటాం. ఈ ట్రాప్‌లో అస్సలు పడొద్దు.
☛ BNPL సేవలను ఉపయోగించుకోవాడనికి ముందే షరతులు, వడ్డీ రేటు, లేటు ఫీజు(Late Fee) గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి కండీషన్‌ను తప్పక చదవాలి. ఎలాంటి లొసుగులు లేకుండా చూసుకోవాలి.
☛ ఒకటికి మించి BNPL సేవలు ఉపయోగించుకునేవారు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ ఉండాలి. పొరపాటున మరచిపోయినా అదనపు రుసుములు చెల్లించాల్సి వస్తుంది.