బండారిని గెలిపించుకుంటాం..ఉప్పల్​ అభివృద్ధి కోనసాగిస్తాం!

మన ఈనాడు:

ప్రజల కోసం పనిచేసే బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మల్లాపూర్​ డివిజన్​ కార్పొరేటర్​ పన్నాల దేవేందర్​రెడ్డి అన్నారు. ఉప్పల్​ బీఆర్​ఎస్​ MLA అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం చేస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు.

సీఎం కేసీఆర్​(KCR) అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్దిదారులే బీఆర్​ఎస్​ అభ్యర్థి గెలుపు పెద్ద బలంగా మారుతుందని పేర్కొన్నారు. మరో వందేళ్ల అభివృద్ధి సాధించాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉందని పిలుపునిచ్చారు.

బీఎల్​ఆర్​ గెలుపుకోసం ఉప్పల్​ నియోజకవర్గంలో ప్రజలే స్వచ్చంధంగా వచ్చి ప్రచారం చేస్తున్నారని, అత్యధిక మెజార్టీ సాధించి గ్రేటర్​లో ఉప్పల్​ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. పనులను వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ, న్యూ భవాని నగర్ కాలనీల్లో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో  BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు ఇంటింటికి వెళ్లి BRS పార్టీ సంక్షేమ పథకాలు, స్థానిక కాలనీ అభివృద్ధి పనుల తెలుపుతూ ప్రచారం చేశారు.

Related Posts

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

దసరా సెలవులు వచ్చేశాయ్.. ఇక పిల్లలకు పండగే

Mana Enadu : అప్పుడెప్పుడో సెప్టెంబరు నెల మొదటి వారంలో వర్షాలు (Rains) కురిసినప్పుడు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. ఆ తర్వాత ఒకరోజు వినాయక చవితికి, మరో రోజు గణేశ్ నిమజ్జనానికి (Ganesh Immersion) హాలిడేస్ ఇచ్చారు. ఇక అప్పటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *