
అమెరికా(USA)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. USలోని ఫ్లోరిడాలో ఇవాళ (మార్చి 17) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు(Telangana People) అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని టేకులపల్లి వాసులుగా సమాచారం. మృతులు మాజీ సర్పంచ్, MPTC మోహన్ రెడ్డి కుటుంబీకులుగా పోలీసులు గుర్తించారు.
కాగా మృతి చెందిన వారిలో ప్రగతి రెడ్డి (35) ఆమె కుమారుడు హర్వీన్ (6), కోడలు సునీత (56) ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించటంతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.