Mana Enadu : హైదరాబాద్ (Hyderabad) మహానగరం గణపతి నిమజ్జనానికి సిద్ధం అవుతోంది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నగరవ్యాప్తంగా ఈనెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నిమజ్జన ప్రక్రియ (Ganesh Immersion) జరగనుంది. ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేశులు శోభాయాత్రగా తరలివచ్చి గంగమ్మ ఒడిలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి 2 వరకు మెట్రో
మరోవైపు గణేశ్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం నిమజ్జనం (Ganesh Nimajjanam) రోజున ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. చివరి స్టేషన్‌లో నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలు దేరుతుందని వెల్లడించింది.
ఒక్కరోజే 94వేల ప్రయాణికులు
గణేశ్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని మెట్రో సంస్థ (Hyderabad Metro) పేర్కొంది. మరో వైపు ఆదివారం ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్‌లు కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. శనివారం ఒక్క రోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ను 94వేల మంది ప్రయాణికులు వినియోగించుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
రెండ్రోజులు వైన్స్ బంద్
మరోవైపు గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మహానగరంలో రెండ్రోజుల పాటు వైన్ షాప్స్ (Wine Shops Closed) బంద్ కానున్నాయి. ఈ నెల 17b తేదీ మంగళవారం, బుధవారాల్లో ఈ బంద్ అమల్లో ఉంటుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (AP CV Anand) తెలిపారు. ఈ ఆదేశాలు వైన్ షాపులతోపాటు కల్లు దుకాణాలు, బార్లకూ వర్తిస్తాయని వెల్లడించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసెస్
ఇంకోవైపు వినాయక నిమజ్జనం వేళ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఎంఎంటీఎస్ (MMTS Trains) సర్వీసులు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 8 రైళ్లు నడుస్తాయని పేర్కొంది. 17, 18 తేదీల్లో లింగంపల్లి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి రాత్రి, ఉదయం వేళ ఈ రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…