Uppal: మూడు రంగుల జెండానే ఊపిరిగా పనిచేశాం..

మన ఈనాడు: కాంగ్రెస్​ పార్టీ అధికారం సాధించే దిశగా ప్రతి కార్యకర్త మూడు రంగుల జెండా ఊపిరిగా పనిచేశారని వారికి తగిన గుర్తింపు వస్తోందని ఆపార్టీ ఉప్పల్​ ఇంఛార్జీ మందముల పరమేశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భాగంగా మల్లాపూర్​ వీఎన్​ఆర్​ గార్డెన్స్​లో బీబ్లాక్​ పరిధిలోని నాయకులతో సమావేశం అయ్యారు.

ఎన్నికల హామీలలో భాగంగా ఆరు గ్యారంటీల అమలు చేస్తామని వాగ్ధానం చేశాం. అధికారం సాధించిన రెండురోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ప్రజల్లోకి కాంగ్రెస్​ సర్కారు అమలు చేసిన రెండు పథకాలు విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్ట:సుఖాలు తెలుసుకుంటూనే జనం సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్​ నాయకులు కీలకంగా పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ , రాఘవ రెడ్డి , అంజిరెడ్డి , సీతారాం రెడ్డి , కృష్ణ రెడ్డి , జలగం వెంకటేష్ , రాజేందర్ , నెమలి అనిల్ కుమార్, పత్తి కుమార్ ,అంజయ్య ,యాదగిరి,సుదర్శన్,
సద్గుణ ,గట్టయ్య ,రాజేష్ , సాయి గౌడ్ , బాలరాజ్ గౌడ్ , రాజు గౌడ్ ,కిట్టు , శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు

 

Share post:

Popular