మన ఈనాడు: హైదరాబాద్లోని రామంతపూర్ స్ఫూర్తి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ కుష్టు వ్యాధి నివారణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లెఫ్రాలజిస్ట్ ట్రెజరర్ డాక్టర్ రాజ్యలక్ష్మి, స్ఫూర్తి విద్యా సంస్థల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులందరూ చర్మవ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా శరీరంపై ఏర్పడే మచ్చలను గమనించి వాటికి స్పర్శ ఉందా లేదా అని గమనించాలన్నారు.
స్పర్శ లేకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. కాబట్టి విద్యార్థులందరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం కూడా ఆరోగ్యకరంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుష్టు వ్యాధి లక్షణాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా . నరసింహారావు, డా. సుజయ్ సునీత సహకారంతో కుష్టు వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కళాశాల చైర్మన్ సురేష్ గౌడ్ మాట్లాడుతూ… విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. సమయానికి భోజనం చేయాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, అబ్బాస్ , రోషన్, సంపత్ పాల్గొన్నారు.