మన ఈనాడుః ఓట్ల పండగకి రోజులు దగ్గరపడుతున్నాయి..అభ్యర్థులు ప్రచారం రోజురోజుకు వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు.. బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపుకోసం ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మంగళవారం ఉదయం మల్లాపూర్ డివిజన్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లుతో కలిసి కార్మికుల సభ నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడతా..రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలపించాలని ప్రజలని కోరుతున్నారు.
ఉప్పల్లో మల్లాపూర్‌దే ఆధిక్యం
ఉప్పల్ నియోజకవర్గం పది డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ సాధించే స్థానం మల్లాపూర్ డివిజన్‌దే. స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మల్లాపూర్ బీఆర్ఎస్ బలం చూపించే దిశగా తన అనుచరులతో ప్రత్యేకంగా వ్యూహం రచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషణ చేస్తూ..బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. తర్వాతి స్థానంలో మీర్‌పేట్ హౌసింగ్ బోర్డు మెజార్టీ సాధించే డివిజన్‌గా రెండోవస్థానంలో ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.