మన ఈనాడు: రామాంతపూర్ డివిజన్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ లో సత్యసాయి గ్రూప్ అఫ్ స్కూల్ ,స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ MLAబండారి లక్ష్మా రెడ్డి హజరై జ్యోతి వెలిగించారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని MLA బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు.
క్రీడారంగం నుంచి నేర్చుకున్న పాఠాలు ఎవరినైనా జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి. నిజానికి క్రీడలు, జీవితానికి అండగా నిలిచే సిసలైన వ్యవస్థ” అని పేర్కొన్నారు.
విద్యాసంస్థలన ఛైర్మన్ గడ్డం సాయి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుండటాన్ని ఎమ్మెల్యే బండారి అభినందించారు .
ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మా రెడ్డి ,గంథం నాగేశ్వరావు ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ,డాక్టర్ చారి ,కాలేరు జై నవీన్ ,సోమనారాయణ రెడ్డి ,సురం శంకర్ ,బోసాని పవన్ ,ప్రశాంత్ ,శ్రీనివాస్ పాల్గొన్నారు .