ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లో మూకుమ్ముడిగా 200మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేశారు. జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, సురేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి మందముళ్ల పరమేశ్వరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గులాబీ పార్టీలో ఉద్యమం నుంచి పనిచేస్తున్న సముచితం స్థానం కల్పించడం లేదన్నారు. ఉప్పల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోని అసెంబ్లీకి పంపిస్తామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని అన్నారు. నిరుద్యోగుల జాబ్ కార్డుతో యువత మొత్తం కాంగ్రెస్ వైపే చూస్తుందని నవంబర్ 30న జరిగే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివెళ్లి హస్తం గుర్తుకు ఓటేయ్యాలని కోరారు.