మన ఈనాడు:సెమీస్‌లో కివీస్‌పై మ్యాచ్‌లో ఏడు వికెట్లతో సత్తా చాటిన షమీ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి. ఈ వరల్డ్ కప్‌లో షమీకి మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన బౌలర్ షమీ.
ఎన్నెన్ని రికార్డులు..
భారత్ తరుఫున వన్డేల్లో అత్యుత్తుమ గణాంకాలు నమోదు చేసిన షమీ.. సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్‌గా నిలిచాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన బౌలర్ షమీ. ఈ ఒక్క వరల్డ్‌కప్‌లోనే షమీ మూడు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌కప్‌ల్లో వేగంగా 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా షమీ సరి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో 17 ఇన్నింగ్స్‌లో నాలుగు సార్లు ఐదు వికెట్లు కూల్చాడు షమీ. ఐసీసీ ఈవెంట్లలో ఇదే అత్యుత్తుమం. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మూడు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఈ వరల్డ్‌కప్‌లో షమీ బౌలింగ్ యావరేజ్ 9.56. అంటే సుమారు ప్రతి 10 బంతులకు ఒక వికెట్ తీశాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ల్లోనూ టాప్:
ఈ వరల్డ్ కప్‌లో షమీకి మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌లపై షమీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకుంటున్నాడంటే అతనిలో పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐసీసీ నాకౌట్లలో ఓ భారతీయ బౌలర్ ఫైఫర్(ఒక్కటే మ్యాచ్‌లో 5 వికెట్లు) తియ్యడం ఇదే తొలిసారి. కివీస్‌పై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో కలిపి ఈ ఏడాది మొత్తంగ 5సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. ఇక ప్రపంచకప్ హిస్టరీలో నాలుగు సార్లు ప్లేయర్ ఆప్ ది అవార్డు అందుకున్న బౌలర్ షమీ.. అందులో మూడు సార్లు ఈ వరల్డ్‌కప్‌లోనే ఉన్నాయంటే షమీ ఫామ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. ఇక వన్డే హిస్టరీలో ఇప్పటివరకు 9సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న షమీ.. ఇందులో 5సార్లు న్యూజిలాండ్‌పై వికెట్లు పడగొట్టి అందుకోవడం విశేషం