బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్, తన తొలి టెస్ట్ డబుల్ సెంచరీ(Double Century)ని నమోదు చేసి, ఇంగ్లండ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్(India Captain)గా రికార్డు సృష్టించాడు. 311 బంతుల్లో 21 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గిల్, విరాట్ కోహ్లీ (2018లో 149) రికార్డును అధిగమించాడు.
TEST AVERAGE OF SHUBMAN GILL HAS CROSSED 40. 🔥#INDvsENG #ENGvsIND #ENGvIND #INDvENG #INDvsENG2025 #ShubmanGill pic.twitter.com/uvDG7zXrRF
— The Sports Feed (@thesports_feed) July 3, 2025
ట్రిపుల్ సెంచరీ చేసేనా..
తొలి రోజు (114 నాటౌట్‌తో) సెంచరీతో ముగించిన గిల్, రెండో రోజు రవీంద్ర జడేజా (89)తో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్(Washington Sunder)తో 144 పరుగుల భాగస్వామ్యం ద్వారా భారత జట్టును రెండో రోజు టీ బ్రేక్ సమయానికి 564/7 స్కోరుకు చేర్చాడు. గిల్ ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 4% ఫాల్స్ షాట్స్ ఆడాడు, ఇది 2006 నుంచి ఇంగ్లండ్‌లో అత్యల్ప ఫాల్స్ షాట్ రేట్‌తో సెంచరీ సాధించిన రికార్డు సాధించాడు. భారత బ్యాటర్లలో జైస్వాల్ (87), కరుణ్ (31), పంత్ (25), జడేజా (89), సుందర్ (42) రన్స్ చేయగా.. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 2 వికెట్లు తీయగా, బెన్ స్టోక్స్, కార్స్, టంగ్, బషీర్, రూట్ తలో వికెట్ పడగొట్టారు. కాగా గిల్ మూడో సెషన్‌లో వేగంగా ఆడి ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది.
𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘 𝐌𝐀𝐃𝐄! 🚨
Shubman Gill slams his MAIDEN DOUBLE CENTURY in Tests 💯💯🔥No noise, no drama — just pure domination 🧊
Captain’s knock. Leader’s intent. Future is already here! 👑🫡#ShubmanGill #ENGvsIND #INDpic.twitter.com/2ovI5rK1R3— Abhi Sharma (@TheASCode) July 3, 2025






