సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిని మోదీ సర్కారు మరోసారి కొత్త సంచలనాలకు తెరతీయబోతోంది. ఇప్పటికే జీ20 సదస్సు నేపథ్యంలో ఇండియా పేరును భారత్‌గా మార్చుతు గెజిట్ విడుదల చేసిన సర్కారు, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు జమిలీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వీటిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగానే.. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
18వ తేదీ నుంచి 22 వరకు జరిగే ఈ సమావేశాల్లో భారత్ పేరు మార్చడంతో పాటు, ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం జమిలీ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి లాంటి మూడు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. సమావేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పక హాజరు కావాలని, ఈ మూడు బిల్లులకూ ఆమోదం తెలపాల్సిందేనని హుకూం జారీ చేసింది.