Mana Enadu: న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిశాక భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో టీమ్ఇండియా(TeamIndia) 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) కోసం కూడా BCCI జట్టు ప్రకటించింది. టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్(Sky) కెప్టన్సీ చేపట్టనుండగా.. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు రోహిత్(Rohit) కెప్టెన్‌గా, బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నారు.
అయితే టెస్టు టీంలో చోటు కోసం ఎదురుచూస్తున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరోసారి నిరాశే ఎదురైంది. వారిద్దరికీ జట్టులో చోటు దక్కలేదు. అటు గాయం నుంచి పూర్తిగా కోలుకోని షమీని సైతం బీసీసీై పక్కనపెట్టింది. అయితే అనూహ్యంగా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(NKR)ని మాత్రం తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. దేశవాళీల్లో సత్తాచాటుతున్న అభిమన్యు ఈశ్వరన్ కూడా ఆస్ట్రేలియా(Australia) పర్యటనకు వెళ్లనున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు టీమ్ఇండిమా:
రోహిత్(C), బుమ్రా(VC), జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్ (WK), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (WK), అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. ట్రావెలింగ్ రిజర్వ్: ముకేశ్ కుమార్, నవదీప్ సైనా, ఖలీల్ అహ్మద్.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్
1st Test: నవంబర్ 22-26
2nd Test: డిసెంబర్ 6-10
3rd Test: డిసెంబర్ 14-18
4th Test: డిసెంబర్ 26-30
5th Test: జనవరి 3-07 (2025)
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (C), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్.
https://twitter.com/BCCI/status/1849852590823178575