బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో (Border Gavaskar Trophy) ఇక భారత్ ప్రాక్టీస్ సెషన్ ఫ్యాన్స్ లేకుండానే కొనసాగనుంది. అడిలైడ్ టెస్టు కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేస్తుండగా.. కొందరు ఫ్యాన్స్ అనుచిత ప్రవర్తనే దీనికి కారణంగా కనిపిస్తోంది. రోహిత్ సేన ప్రాక్టీస్ చేసే సమయంలో భారీగా అభిమానులు ఆడిలైడ్ స్టేడియానికి వచ్చారు. భారత ప్లేయర్లను ఉద్దేశించి దురుసు వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఇబ్బంది పడినట్లు సమాచారం.
నెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో అంతా గోల గోలగా ఉంటుంది. ప్రాక్టీస్ చేసే సమయంలో స్టేడియంలోకి అభిమానులను అనుమతించడంతో దాదాపు 3 వేల మందికి పైగా స్టేడియానికి వచ్చారు. ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్ చేసే సమయంలో మాత్రం కేవలం 100 మందిలోపే ఉన్నారు. విరాట్ కోహ్లి, (Virat Kohli) శుభమన్ గిల్ (Shubham Gill) ఆడుతున్నప్పుడు అభిమానుల్లో కొందరు ఫేస్ బుక్ లైవ్ పెట్టారు.
పిచ్ స్పిన్నర్లకూ సహకరిస్తుంది
కొందరు వీడియో కాల్స్‌లో వారిని చూపిస్తూ గట్టిగా మాట్లాడుతూ.. హాయ్ చెప్పాలని పదే పదే అడిగారు. మరొకరు క్రికెటర్ల శరీరం గురించి హేళన గా మాట్లాడారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోపీలో మిగతా మ్యాచ్ లకు నెట్ ప్రాక్టీస్ సమయంలో అభిమానులను అనుమతించడం లేదని చెప్పారు. ఆడిలైడ్ లో (Adelaide) పిచ్ స్పిన్నర్లకూ సహకరిస్తుందని ప్రధాన క్యురేటర్ డామియన్ హోప్ చెప్పగా.. పచ్చిక వల్ల ఆరంభంలో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అన్నాడు. పిచ్ పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంటుంది. పిచ్ నుంచి వీలైనంత పేస్, బౌన్స్ రాబట్టడంతో పాటు.. బంతి త్వరగా రంగు కోల్పోకుండా చేయడం కోసమే పిచ్ పై ఎక్కువ పచ్చిక ఉంచుతున్నట్లు చెప్పారు.
ముమ్మరంగా ప్రాక్టీస్
ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా పాల్గొన్నారు. బుమ్రా, బౌలింగ్‌లో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో తెగ వైరల్‌గా మారింది. దీంతో రోహిత్ శర్మ,(Rohit Sharma ) బుమ్రా (jaspreet bumra) మధ్య వార్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే గత ఆడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా ఘోరంగా ఓడిపోయింది. కేవలం 36 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈసారి ఆ పిచ్ పై ఎలాగైనా గెలిచి విజయం సాధించాలని భారత క్రికెటర్లు పట్టుదలతో ఉన్నారు.
Team India's practice session at Adelaide Oval before India vs Australia 2nd Test 🇮🇳 pic.twitter.com/JorBy16Bbe
— Samar (@SamarPa71046193) December 5, 2024








