ఇంగ్లండ్(England)లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team)కు దాదాపు నెల రోజులకుపైనే రెస్టు లభించింది. అయితే, ఆటగాళ్లకు త్వరలోనే మళ్లీ బిజీ షెడ్యూల్(busy Schedule) మొదలు కానుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే T20 ప్రపంచ కప్ (T20 World Cup 2026) వరకు భారత జట్టు ఆటగాళ్లు నిరంతరం క్రికెట్ ఆడనున్నారు. బంగ్లాదేశ్ (Bangladesh) పర్యటన వాయిదా పడటంతో ఆగస్టులో భారత జట్టుకు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. కానీ, సెప్టెంబర్‌లో యూఏఈలో జరిగే 2025 ఆసియా కప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టనుంది.
ఈ ఏడాది చివరి వరకు మరో 4 టెస్టులు ఆడనున్న భారత్
ఈ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)తో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్(WI), దక్షిణాఫ్రికా(SA)తో రెండు సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల మధ్య, ఆస్ట్రేలియా(AUS)లో వన్డే, T20 సిరీస్‌లలో పాల్గొంటుంది. వైట్ బాల్ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్(NZ)తో స్వదేశంలో సిరీస్‌లు ఆడనుంది. రాబోయే రోజుల్లో భారత్ మొత్తం దృష్టి 2026 T20 ప్రపంచకప్ పైనే ఉండనుంది. ఈ టోర్నమెంట్ వరకు, భారత జట్టు దాదాపు 22-31 T20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ప్రపంచ కప్‌కు ముందు 18-22 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు 4 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే, జనవరి చివరి వరకు షెడ్యూల్ చేసిన 9 వన్డేలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటారు.
2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమ్ఇండియా షెడ్యూల్ ఇలా..
☛ ఆసియా కప్ – సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు – 3నుంచి 7 టీ20లు – యూఏఐలో ఆడుతుంది.
☛ ఇండియా-వెస్టిండీస్ – అక్టోబర్ 2 నుంచి14 వరకు – 2 టెస్టులు – ఇండియాలో జరుగుతంది.
☛ ఇండియా-ఆస్ట్రేలియా – అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు -3 వన్డేలు/ 5టీ20లు ఆస్ట్రేలియాలో ఆడుతుంది.
☛ ఇండియా-దక్షిణాఫ్రికా – నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు – 2 టెస్టులు/ 3 వన్డేలు/ 5 టీ20లు ఇండియాలో ఉంటుంది.
☛ ఇండియా-న్యూజిలాండ్ – 2026 జనవరి 11 నుంచి 31 వరకు – 3 వన్డేలు/5 టీ20లు – ఇండియాలో జరుగుతుంది.
☛ టీ20 ప్రపంచకప్ 2026 – ఫిబ్రవరి – మార్చి మధ్య – 4 నుంచి 9 టీ20లు – ఇండియా/శ్రీలంకలో నిర్వహిస్తారు.
Mark your dates 🗓️
Test series vs West Indies ✅
All-format series vs South Africa ✅
Here’s Team India’s (Senior Men) schedule for the International Home Season 2025 🔽#TeamIndia | #INDvWI | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/ZJZJ4HFbLa
— BCCI (@BCCI) April 3, 2025






