Jailer – పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇలా ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అయితే, ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్లను మాత్రం అందుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే రజినీకాంత్ ‘జైలర్’ మూవీతో వచ్చారు. ఇది మాత్రం కలెక్షన్ల సునామీని సృష్టించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!
జైలర్‌గా వచ్చిన రజినీకాంత్:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రమే ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు కీలక పాత్రలను పోషించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ చేశాడు.
జైలర్’ మూవీ భారీ అంచనాలతో రూపొందింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.
‘జైలర్’ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7వ రోజు సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 1.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 14 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 2.63 కోట్లు షేర్, రూ. 4.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
తెలుగులో ఎన్ని కోట్ల లాభం:హై రేంజ్ యాక్షన్‌తో వచ్చిన ‘జైలర్’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 7 రోజుల్లోనే రూ. 31.23 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 18.23 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.
ఓవరాల్‌గా లాభం ఎంతంటే:’జైలర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 7 రోజుల్లో రూ. 208.40 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 84.40 కోట్లు లాభాలను అందుకుంది. ఇక, ఈ చిత్రం ‘విక్రమ్’ టోటల్ కలెక్షన్లను దాటి.. ‘సాహో’ రికార్డుకు చేరువ అయింది.