Jailer-2: రజనీ బర్త్ డే.. స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్న డైరెక్టర్!

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth).. 73 ఏళ్ల వయస్సులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గని స్టార్ యాక్టర్. అంత ఏజ్‌లోనూ ఇప్పటికీ తన మ్యానరిజం, డ్యాన్స్, ఫైట్ సీన్లతో ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్(Vettaiyan)’ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్ల పరంగా రజనీ ఫ్యాన్స్ ఆ మూవీ మేకర్స్‌ను బాగానే ఆదుకున్నారు. ఇక రజనీ నటించిన జైలర్(Jailer) మూవీ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు సాధించింది. ఆ సినిమాలో రజనీ మ్యానరిజం, నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) డైరెక్షన్, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఆ సినిమాను సూపర్ హిట్ చేశాయి. తాజాగా రజనీ కొత్త మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

కథం సిద్ధం చేసిన డైరెక్టర్?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబర్ 12న తన 74వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Director Nelson Dileep Kumar) జైలర్-2(Jailer-2)కి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రోమో(Video Promo)ని డిసెంబర్ 5న షూట్ చేసి రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12 ప్రకటించేందుకు డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టే సన్‌నెట్ వర్క్(Sunnet work) తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జైలర్ మొదటి భాగానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మెమోరీస్‌ని తవ్వి తీస్తోంది. ఈ సినిమాలో హీరో ధనుష్(Dhanush) కూడా నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం రజనీ-లోకేష్ కనగరాజ్ కాంబోలో “కూలి” మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

కొత్త ప్రతినాయకుడి కోసం వేట

ఇదిలా ఉండగా జైలర్ ఫస్ట్ పార్ట్ లాగే సెకండ్ పార్టీను వేగవంతంగా పూర్తి చేయబోతున్నాడట డైరెక్టర్ నెల్సన్. అయితే ఇందులో ఏం చూపిస్తారనే డౌట్ రావడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ముత్తువేల్ పాండియన్(Muthuvel Pandian) ఫ్లాష్ బ్యాక్‌ని ఎక్కువగా చూపిస్తారని తెలిసింది. జైలర్ 1లో కేవలం జైలు ఎపిసోడ్లకు పరిమితమైన యంగ్ లుక్‌ని ఈసారి పూర్తి స్థాయిలో వాడబోతున్నారట. కొడుకు, విలన్ ఇద్దరూ చనిపోయారు కాబట్టి ఈసారి కొత్త ప్రతినాయకుడు కావాలి. దానికోసం ఓ బాలీవుడ్ నటుడిని సెట్ చేసే పనిలో ఉందట మూవీ టీమ్. మరి జైలర్-2 ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

Share post:

లేటెస్ట్