
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan).. ఏపీ రాజకీయాల్లో(AP Politics) ఇప్పుడు ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. సరిగ్గా 12 ఏళ్ల క్రితం సినీ నటుడు, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వైపు అడుగులు పడిన రోజు. 2014 మార్చి 14న జనసేన(Janasena) పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనపై ప్రజల్లో విపరీతమైన అభిమానం ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ అభిమాన నటుడు తీర్చడానికి వస్తున్నాడని ఎంతో సంతోషించారు. అందుకు తగ్గట్లే పవన్ ప్రజలతో మమేకమయ్యారు. కానీ ఆయన తొలిసారి పోటీ చేసిన 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనపై అంత నమ్మకం చూపించలేదు. దీంతో ఏమాత్రం కుంగిపోని పవన్ క్షేత్రస్థాయిలో ప్రజలను కలిశారు. వారి కష్టాలు, బాధలను తెలుసుకున్నారు. 2024లో మళ్లీ ఎన్నికల్లో(AP Elections 2024) పోటీ చేసి 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆయన ఏ కార్యక్రమం చేసినా సంచలనమే..
ప్రస్తుతం పవన్ ఏ కార్యక్రమం చేసినా సంచలనమే. ఆయన రేంజ్ దేశ రాజకీయాలను శాసించే విధంగా మారిపోయింది అంటారు జనసేన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు. నిజానికి అధికారం లేనప్పుడు కూడా అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగే విధానం, ఎండగట్టే విధానం ఆయనను ఇంత స్థాయికి తీసుకొచ్చింది. అలాంటి తరుణంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు(Janasena Formation Day Celebrations) అత్యంత ఘనంగా, ఆయనకు ఘనవిజయం అందించిన పిఠాపురం(Pithapuram)లో నేడు పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు.
జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించనున్న పవన్
ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పర్యవేక్షణలో పూర్తిచేశారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరనున్నారు. సాయంత్రం 3.45 గంటలకు సభా స్థలికి చేరుకొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని JNTU గెస్ట్ హౌజ్లో బస చేస్తారు. కాగా దాదాపు 1600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చేవారి కోసం భోజనం, మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ సిబ్బందిని సిద్ధం చేశారు. ఈ వేడుకలకు సుమారు 10లక్షల మంది వస్తారని అంచనా.