Jasprit Bumrah: బుమ్రాదే ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డ్

టీమ్ఇండియా(Team India) పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 2024 డిసెంబర్ నెలకు గాను ‘క్రికెటర్ ఆఫ్ ది మంత్(Cricketer of the Month)’గా నిలిచాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins), సౌతాఫ్రికా పేసర్ డేన్ పాటర్సన్‌(Dane Patterson)లతో పోటీపడిన బుమ్రా చివరకు ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT)లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా అదరగొట్టాడు. మొత్తం 32 వికెట్లతో సత్తా చాటాడు. జట్టులో ఒక్క బుమ్రా మాత్రమే రాణించగా.. మిగతా బౌలర్లు అతడికి సహకారం అందించడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ BGTని కోల్పోవాల్సి వచ్చింది.

44వ టెస్టులోనే బుమ్రా ఘనత

ఇక ఆసీస్ పర్యటనలో భారత్ 5 టెస్టులు ఆడింది. ఈ సిరీస్‌లో బుమ్రా(Bumrah) రెచ్చిపోయాడు. ఓవరాల్ గా 32 వికెట్లతో అదరగొట్టాడు. రెండో స్థానంలో ఉన్న కమిన్స్ (25 Wickets)పై స్పష్టమైన ఆధిక్యం చూపించాడు. అలాగే ఈ సిరీస్‌లోనే బుమ్రా తన కెరీర్ లో కొన్ని మైలురాళ్లను అధిగమించాడు. టెస్టుల్లో 19 సగటుతో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 148 ఏళ్ల టెస్టు క్రికెట్లో ఇంత తక్కువ సగటుతో ఏ బౌలర్ కూడా 200 వికెట్లు తీయలేదు. అలాగే అత్యంత వేగవంతంగా 200 వికెట్లను తీసిన భారత పేసర్‌(Indian pacer)గా గుర్తింపు పొందాడు. కేవలం తన 44వ టెస్టులోనే బుమ్రా ఈ ఘనత సాధించడం విశేషం.

ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతాడా?

కాగా సిడ్నీ(Sydney)లో జరిగిన చివరి టెస్టులో వెన్ను నొప్పి(back pain)తో బాధ పడిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేదు. లేకపోతే మరిన్ని రికార్డులను తన ఖాతాల వేసుకునేవాడు. ఆ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ చేయకపోవడంతో పండుగ చూసుకున్న ఆసీస్ బ్యాటర్లు ఆరు వికెట్లతో విజయాన్ని సాధించారు. దీంతో భారత్ 1-3తో సిరీస్ ఓడిపోయింది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(World Test Championship Final) రేసు నుంచి ఔటయ్యింది. ఇక బుమ్రా గాయం గురించి BCCI ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అతడు వచ్చేనెలలో జరిగే ICC ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో బరిలోకి దిగుతాడో లేదో అనే అనుమానం నెలకొంది.

ICC Champions Trophy 2025 India Squad Announcement LIVE: Jasprit Bumrah's  injury likely to puzzle selectors | Mint

Related Posts

SRH vs PBKS: అభిషేక్ ఊచకోత.. పంజాబ్‌పై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

వారెవ్వా.. వాట్ మ్యాచ్.. ఏమా ధైర్యం.. ఏమిటా హిట్టింగ్.. వరల్డ్స్ క్లాస్ బౌలర్లను చిత్తు చేస్తూ అభిషేక్ వర్మ చేసిన విధ్వంసం గురించి ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన…

IPL ఓపెనింగ్ సెర్మనీ.. సందడి చేయనున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *