Jio Offer: జియో కొత్త ఆఫర్ చూశారా? ఒకే మొబైల్ నంబర్‌తో ఇంటిల్లిపాదికి సిమ్ కార్డులు!

జియో యూజర్లకు ఒక అద్భుతమైన అవకాశాన్ని(Jio New Offe) అందిస్తోంది. ఇకపై మీ ఇంట్లో ప్రతి ఒక్కరికీ వేర్వేరు మొబైల్ నంబర్ల(One Number SIMs for the Whole Family) అవసరం లేదు. మీ మొబైల్ నంబర్‌ను ఫ్యామిలీ మెంబర్లతో(Whole Family) షేర్ చేసుకోవచ్చు. ఇదే జియో ఫ్యామిలీ మ్యాచింగ్ నంబర్ సర్వీస్ ప్రత్యేకత!

ఇటీవలి టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరి నంబర్‌ను గుర్తుంచుకోవడం కష్టమే. చిన్న పిల్లలైతే తమ పేరెంట్స్ నంబర్ గుర్తుంచుకోవడమే సవాలుగా మారుతోంది. అలాంటి సమస్యకు పరిష్కారంగా జియో తీసుకొచ్చిన ఈ సర్వీస్, ఒకే నంబర్‌తో అనేక సిమ్ కార్డులను పొందే అవకాశం ఇస్తుంది.

జియో ఫ్యామిలీ మ్యాచింగ్ నంబర్ అంటే ఏంటి?

జియో ఫ్యామిలీ మ్యాచింగ్ నంబర్ సర్వీస్ ద్వారా మీరు ఇప్పటికే ఉపయోగిస్తున్న జియో నంబర్‌ను ఆధారంగా తీసుకుని, దానికి సమానంగా ఉండే కొత్త నంబర్‌ను మీ కుటుంబ సభ్యుల కోసం ఎంపిక చేసుకోవచ్చు.
ఈ సౌకర్యం “Jio Choice Number” సర్వీస్‌ ద్వారా లభిస్తుంది.

ఈ సర్వీస్‌ పొందడానికి రెండు మార్గాలు:

1. జియో రిటైల్ స్టోర్‌ను సందర్శించండి

2. www.jio.com వెబ్‌సైట్‌ను ఉపయోగించండి

వెబ్‌సైట్‌ ద్వారా ఎలా చేయాలి?

జియో అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

“Choice Number” సెర్చ్ చేయండి

మీ ప్రస్తుత జియో నంబర్ ఎంటర్ చేసి OTP తీసుకోండి

OTP వేరిఫై చేసిన తర్వాత స్క్రీన్‌పై అనేక మ్యాచింగ్ నంబర్లు కనిపిస్తాయి

మీకు నచ్చిన నంబర్‌ను ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు

కొత్త సిమ్‌ ఫ్రీగా వస్తుంది (అయితే కొత్తగా సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది, పాత నంబర్ మారదు)

ఈ మ్యాచింగ్ నంబర్ సౌకర్యం కోసం:

మీరు Jio Postpaid Plan‌కి మారాలి

MyJio యాప్ లేదా jio.com ద్వారా కన్వర్ట్ చేసుకోవచ్చు

ప్లాన్ మారేటప్పుడు జియో అథెంటికేషన్ ప్రక్రియ ప్రకారం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది

జియో నుంచి కొత్త ప్లాన్ – రూ. 189 లో బంపర్ బెనిఫిట్స్!

జియో తాజా ప్లాన్‌ను రూ. 189కే లాంచ్ చేసింది.

ఈ ప్లాన్‌లో:

2GB హై స్పీడ్ డేటా

అన్‌లిమిటెడ్ కాల్స్

రోజుకు 100 ఫ్రీ SMS

28 రోజుల వ్యాలిడిటీ

ఈ సర్వీస్ వల్ల పెద్దలే కాకుండా పిల్లలు కూడా తమ ఫ్యామిలీ నంబర్‌ను సులభంగా గుర్తుంచుకోగలుగుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని కుటుంబంలో కనెక్టివిటీని మెరుగుపరచే దిశగా జియో తీసుకున్న మరో మంచి ముందడుగు ఇది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *