యంగ్ టైగర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాగా మరోటి బాలీవుడ్ సినిమా వార్ – 2. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రానుంది.
ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది. కాగా ఈ సోమవారంతో ఈ సినిమా షూటింగ్ యూనిట్ ప్రారంభించింది . ఫైనల్ షెడ్యూల్ ను అమెరికాలో మొదలెట్టి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూట్ దాదాపుగా ముగిసిందని మేకర్స్ వెల్లడించారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినిమా ఆడియెన్స్ కూడా వార్ -2 ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందనే వెయిట్ చేస్తున్నారు.
కొత్త ఏడాదికి ఫ్యాన్స్కి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేలా సినిమా యానిట్ ఆలోచన చేస్తుంది. ఈ సినిమాతో యంగ్ టైగర్ మరోసారి రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే డాన్స్ మూమెంట్స్ తో ఇరగతీసే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించే సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలువబొందట.








