కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రద్దు – విమాన ప్రమాదం నేపథ్యంలో మంచు విష్ణు ట్విట్

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కన్నప్ప(Kanappa Trailer ) సినిమా ట్రైలర్ జూన్ 13న విడుదల చేయనున్నట్టు నిర్మాత మరియు హీరో మంచు విష్ణు(Manchu Vishnu) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. కానీ అనుకోని ఘటన కారణంగా ఈ ఈవెంట్‌ను ఆర్గనైజర్లు రద్దు చేయాల్సి వచ్చింది.

ఈరోజు (జూన్ 12) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ విమానం లండన్ వెళ్తుండగా, టేకాఫ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో కొందరు మరణించినట్లు సమాచారం అందింది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

ఈ ఘోర సంఘటన నేపథ్యంలో, కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు మంచు విష్ణు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ట్రైలర్ విడుదలను ఒకరోజు వాయిదా వేస్తున్నామని ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “ఇలాంటి విషాద సమయంలో వేడుకలు నిర్వహించడం సరికాదు” అని పేర్కొంటూ, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కన్నప్ప ట్రైలర్ జూన్ 14న విడుదలయ్యే అవకాశం ఉంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *