
కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆమె కేవలం దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తీసుకొచ్చినట్లు భావించిన పోలీసులకు.. షాకింగ్ విషయాలు తెలిశాయి.
30 సార్లు దుబాయ్‌కు
అయితే కేవలం దుబాయ్ మాత్రమే కాకుండా యూఏఈ, యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు కూడా వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు వీలైనంత రహస్యంగా ఉంచాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తెలిపారు. రన్యా రావు గతేడాది 30 సార్లు దుబాయ్‌కు వెళ్లిందని వెల్లడించారు.
అమెరికా, యూరప్ దేశాలకు రన్యా
రన్యా రావు కేవలం 15 రోజుల్లో నాలుగుసార్లు.. ప్రతి ట్రిప్‌లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు వెల్లడించారు. ప్రతి ట్రిప్‌కు ఆమె రూ.12 నుంచి రూ.13 లక్షలు తీసుకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన రన్యా రానును నిఘా పెట్టిన అధికారులు ఎయిర్ పోర్టులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే.