
తెలుగులో మహానటి, సీతారామం, లక్మీ భాస్కర్ వంటి మూవీలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతో అతడికి టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్ దక్కింది. దీంతో తెలుగులో వరుసబెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. తాజాగా ‘కాంత(Kantha)’ అనే సినిమా చేస్తున్నాడు. దీనిని కొత్త డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో దుల్కర్‌కు జంటగా భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను రివిల్ చేశారు.
‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్ ఎంట్రీ
‘మిస్టర్ బచ్చన్(Mister Bacchan)’తో ఫేమ్ తెచ్చకున్న భాగ్యశ్రీ తాజాగా ‘కాంత’ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన భాగ్యశ్రీ బోర్సే లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో లూజ్ హెయిర్‌తో ఆమె కనిపిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 1950 నాటి కాలంలో మద్రాస్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్నట్లు సమాచారం. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ప్రస్తుతం ‘కాంత’తో పాటు RAPO22, కింగ్‌డమ్ సినిమాల్లో నటిస్తోంది.
In the echoes of history, her love still whispers. 🩷✨#kaantha #RanaDaggubati #SpiritMedia #DQsWayfarerfilms #SelvamaniSelvaraj @ranadaggubati #bhagyashriiborse @thondankani @Prashanthqed #JomVarghese @mesaikrishna #SujaiJames #PalaparthiSravan @accessLunarPunk… pic.twitter.com/enALQLX3vv
— Dulquer Salmaan (@dulQuer) February 14, 2025
కాగా కాంత సినిమాను స్పిరిట్ మీడియా(Sprti Media), వే ఫియర్ బ్యానర్స్‌పై టాలీవుడ్ ప్రముఖ హీరో, సినీ నిర్మాత రానా దగ్గుబాటి(Rana Daggubati)తో కలిసి దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్నారట.