
కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన18 మంది BJP MLAలపై ఆరు నెలల సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు వారిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ యూటీ ఖాదర్(Speaker UT Khadhar) తెలిపారు. హనీ-ట్రాప్ కేసుల అంశం, కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు 4% రిజర్వేషన్లపై బీజేపీ MLAలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం సృష్టించి, సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాకుండా.. సభలోని వెల్‌లోకి ప్రవేశించి, స్పీకర్ కుర్చీ ముందు పేపర్లు చింపి విసిరారు. దీంతో స్పీకర్ ఈ చర్య తీసుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వథ్ నారాయణ్ కూడా ఉన్నారు.
సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు వీరే..
ముఖ్యంగా హనీ ట్రాప్ వ్యవహారం అక్కడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అనేక మంది మంత్రులు సహా ముఖ్య నేతలే లక్ష్యంగా ఈ ‘హనీ ట్రాప్’ కొనసాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీలో బీజేపీ సభ్యులు లేవనెత్తారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు భైరతి బసవరాజ్, డా. శైలేంద్ర బెల్దాలే, మునిరత్న, ధీరజ్ మునిరత్న, BP హరీష్, డా. భరత్ శెట్టి, చంద్రు లమాని, ఉమానాథ్ కోటియన్, రామమూర్తి, దొడ్డనగౌడ పాటిల్, డా. అశ్వత్ నారాయణ్, యశ్‌పాల్ సువర్ణ, బి. సురేష్ గౌడ, శరణు సలగర, చన్నబసప్ప, బసవరాజ మట్టిముడ, ఎస్ఆర్ విశ్వనాథ్‌లను మార్షల్స్ సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.
#WATCH | Bengaluru: 18 Karnataka BJP MLAs being carried out of the Assembly after their suspension.
The House passed the Bill for their suspension for six months for disrupting the proceedings of Assembly. The Bill was tabled by Karnataka Law and Parliamentary Affairs Minister… pic.twitter.com/KKss0M9LVZ
— ANI (@ANI) March 21, 2025