ManaEnadu: హిందువులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. నేటి నుంచి కార్తీకమాసం(Karthika Masam) ప్రారంభమైంది. పరమశివుడి(Lord Shiva)కి, విష్ణువు(Lord Vishnu)కి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో పూజలు చేయడం భక్తులు ఎంతో శ్రేయస్కరమని పండితులు(Scholars) చెబుతారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలో చంద్రుడు(Moon) కృత్తిక నక్షత్రంలో సంచరించడం వల్ల కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నెలలో పవిత్ర నదిలో బ్రహ్మముహూర్తం(Brahmamuhurtam)లో స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
దీపారాధనకు చాలా విశిష్టత
ఈ మాసంలో శివలింగానికి బిల్వదళాలతో అర్చన చేయడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి(Pournami)కి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజు పవిత్ర నదీ స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగిస్తారు. వాటిని పారే నీటిలో లేదా చెరువులో వదిలేస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా మహిమ కలిగినదని చెబుతుంటారు. సాయంత్రం వేళ భక్తులు గుడిలో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటారు.
కార్తీక మాసంలోని ముఖ్యమైన రోజులు ఇవే
కార్తీక మాసమంతా ఒంటిపూట భోజనం చేసే వారుంటారు, సోమవారాలు, కార్తీక పౌర్ణమికి మాత్రం ఉపవాసం చేసే వారుంటారు, ఏకాదశి తిథులలో ఉపవాసం చేసే వారుంటారు. ఏది ఏమైనా ఉపవాసం భక్తుని భగవంతుని దగ్గరగా తీసుకెళ్తుంది. అందుకే ఉపవాసానికి అంతటి విశిష్టత ఉంది. ఎంతో విశిష్టమైన కార్తీక పౌర్ణమి సహా కార్తీక మాసంలోని ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం.
☛ నవంబర్ 3న ఆదివారం, యమవిదియ – భగినీహస్త భోజనం
☛ నవంబర్ 4న- మొదటి కార్తీక సోమవారం
☛ నవంబర్ 5న మంగళవారం – నాగుల చవితి
☛ నవంబర్ 6న బుధవారం – నాగపంచమి
☛ నవంబర్ 11న రెండవ కార్తీక సోమవారం
☛ నవంబర్ 12న మంగళవారం- ఏకాదశి- దీన్నే మాతత్రయ ఏకాదశి అంటారు.
☛ నవంబర్ 13న బుధవారం – క్లీరాబ్ది ద్వాదశి దీపం
☛ నవంబర్ 15న శుక్రవారం – కార్తీక పూర్ణిమ, జ్వాలాతోరణం (365 వత్తులతో దీపాలు వెలిగిస్తారు)
☛ నవంబర్ 18న కార్తీకమాసం మూడో సోమవారం
☛ నవంబర్ 19న మంగళవారం – సంకటహర చతుర్థి (గణేశుడికి గరిక సమర్పిస్తారు)
☛ నవంబర్ 25న కార్తీక మాసం నాలుగో సోమవారం
☛ నవంబర్ 26న మంగళవారం – కార్తీక బహుళ ఏకాదశి
☛ నవంబర్ 29న శుక్రవారం – కార్తీక మాసంలో శివరాత్రి
☛ డిసెంబర్ 1న ఆదివారం – కార్తీక అమావాస్య
https://www.youtube.com/watch?v=ZI_zKOHW2uA






