
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR Birthday) పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆయన బర్త్ డే బాగా ట్రెండ్ అవుతోంది. అయితే పుట్టిన రోజున ఓ వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్ కు ఆ పెళ్లివారు ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే..
సిద్దిపేట జిల్లా పాములపర్తిలో ఓ వివాహ వేడుకకు మాజీ సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన నిండు మనసుతో ఆశీర్వదించారు. ఇవాళ (ఫిబ్రవరి 17వ తేదీ) కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఈ వివాహ వేడుకలో పెళ్లివారు కేసీఆర్ దంపతులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అక్కడే గులాబీ బాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
KCR participated in Satyanarayana Swamy puja as part of wedding at Siddipet pic.twitter.com/znya4zyLi6
— Naveena (@TheNaveena) February 17, 2025
ఈ సందర్భంగా అతిథుల శుభాకాంక్షల మధ్య కేసీఆర్ దంపతులు ఒకరికొకరు ఉంగరాలు, పూలదండలు (KCR and Wife) మార్చుకున్నారు. వివాహానికి హాజరైన అతిథులు, కుటుంబసభ్యులు ఈ అపురూప ఘట్టాన్ని ఆనందంగా వీక్షించారు. ఈ సంఘటన పెళ్లి వేడుకను మరింత ఆకర్షీణయం చేసింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు కేసీఆర్ దంపతులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిన పెళ్లివారిని అభినందిస్తున్నారు.
KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’
‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…