మహానటి సినిమాతో ఒక్కసారిగా సినీ ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న నటి కీర్తి సురేష్(Keerthi Suresh). తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కీర్తి. తాజాగా ఆమె ఓ ఆసక్తికరమైన చిత్రంలో నటిస్తోంది. ‘ఉప్పు కప్పురంబు (Uppu Kappurambu)’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, నటుడు సుహాస్ హీరోగా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా జులై(July) 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
పెళ్లి తర్వాత కొంతకాలం కెరీర్‌కు విరామం ఇచ్చిన నటి కీర్తి సురేశ్ మళ్లీ ఫుల్ స్పీడ్లో ఉంది. తాజాగా ఆమె కోలీవుడ్‌లో రెండు సినిమాలకు ఒప్పుకాగా, టాలీవుడ్‌లోనూ రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ రెండు తెలుగు చిత్రాలు నిర్మాత దిల్‌రాజు(Dil Raju) బ్యానర్‌లో తెరకెక్కనున్నవే కావడం విశేషం.
వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో నటిస్తున్న ‘రౌడీ జనార్దన్'(Roudy Janardan). రవికిరణ్ కోలా(Ravi kiran Kola) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంతో సాగే యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. కీర్తి సురేశ్, విజయ్ దేవరకొండలు ‘మహానటి’లో కలిసి నటించినా.. వారి మధ్య కాంబినేషన్ సీన్లు లేకపోవడంతో, ఈ సినిమా వారిద్దరి తొలి కాంబినేషన్ గా నిలవనుంది.
మరోవైపు, నితిన్ హీరో(Nithin)గా వేణు యెల్దెండి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఎల్లమ్మ'(Ellamma). బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘బలగం’ తర్వాత వేణు చేస్తున్న ఈ చిత్రం ఆధ్యాత్మికత, సంప్రదాయ కళల ఉంటుందని సమాచారం. ఈ రెండు చిత్రాల కోసమే కీర్తి సురేశ్ వరుసగా రెండేళ్లపాటు డేట్స్ కేటాయించినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.






