పెళ్లి ఎప్పుడు, ఎక్కడో చెప్పేసిన కీర్తి సురేశ్​

నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh)​ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్​లోని ప్రముఖ దేవస్థానం తిరుమల తిరుపతి (tirumala) దర్శనం చేసుకుంది. అక్కడ మీడియా ఆమెను ప్రశ్నించగా.. తన కొత్త చిత్రం బేబీ జాన్ (baby john) ప్రమోషన్‌తో పాటు వచ్చే నెలలో జరగబోయే తన పెళ్లి కారణంగా దర్శనానికి వచ్చానని చెప్పింది. పెళ్లి స్థలం ఎక్కడా అని అడగగా గోవాలో జరుగుతుందని సమాధానం ఇచ్చింది.

కీర్తి సురేశ్​ పెళ్లి వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. బిజినెస్​ మ్యాన్​ ఆంటోనీ తట్టిల్‌తో రిలేషన్​లో ఉన్నట్లు కీర్తి ఇటీవలే సోషల్​ మీడియాలో వెల్లడించింది. 15 ఏళ్ల స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుందని పేర్కొంది. ఆంటోనికి దుబాయ్​తోపాటు భారత్​తోనూ పలు వ్యాపారాలున్నాయి.

దక్షిణాదిలో పలు సినిమాలతో క్రేజ్​ సంపాదించుకున్నకీర్తి సురేశ్..​ బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో దళపతి విజయ్​, సమంత నటించిన ‘తెరి’ సినిమా(తెలుగులో పోలీసోడు)కు రీమేక్​గా అట్లీ రూపొందిస్తున్న సినిమా బేబీ జాన్​లో (baby john) వరుణ్ ధావన్‌ (varun dhawan) సరసన ఆడిపాడింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

 

Share post:

లేటెస్ట్