కీర్తి సురేష్(Keerthy Suresh), సుహాస్(Suhaas) ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు ఒరిజినల్ చిత్రం ‘ఉప్పు కప్పురంబు(Uppu Kappurambu)’ డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో ఇవాళ్టి (జులై 4) నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. 90వ దశకంలోని చిట్టి జయపురం(Chitti Jayapuram) అనే ఊరిని నేపథ్యంగా చేసుకుని రూపొందిన ఈ సినిమా, ఒక ప్రత్యేకమైన ఆచారం చుట్టూ తిరిగే కథనంతో ఆకట్టుకుంటుంది. ఊరి పెద్దగా కీర్తి సురేష్, శ్మశానంలో పనిచేసే వ్యక్తిగా సుహాస్ నటన ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. శ్మశానంలో స్థలం(Place in the cemetery) కోసం జరిగే వివాదాలను వినోదాత్మకంగా, అదే సమయంలో ఆలోచింపజేసే విధంగా చిత్రీకరించారు. ఈ సినిమా కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం.

వినోదం, సామాజిక సందేశం అందిస్తూ..
కాగా అనీ ఐ.వి.శశి(Director Annie I.V.Sashi) దర్శకత్వంలో, రాధిక లవు(Radhika Lavu) నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్(Trailer)తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. బాబు మోహన్(Babu Mohan), ఇతర సహాయ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియా(SM)లో సానుకూల స్పందన వస్తోంది. కీర్తి సురేష్ డీ-గ్లామర్ లుక్, సుహాస్ సహజ నటన ప్రశంసలు అందుకుంటున్నాయి. ‘ఉప్పు కప్పురంబు’ అనే నానుడిని కథలో సమర్థవంతంగా చూపించిన తీరు చర్చనీయాంశమైంది. ఈ సినిమా వినోదం(Comady), సామాజిక సందేశాన్ని సమతుల్యంగా అందిస్తూ, తెలుగు ఓటీటీ కంటెంట్‌లో కొత్త పుంతలు తొక్కుతోంది.






