చిన్నజీయర్​ మెచ్చిన నవనీత్​..రాష్ట్ర ప్రథమ బహుమతి అందుకున్న విద్యాసంస్థ

ManaEnadu: వ్యాసరచన పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన నవనీత్​ చిన్నజీయర్​ స్వామిని మెప్పించాడు. త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అనుబంధ ప్రజ్ఞా వికాస్ సంస్థ (Prajna Vikas Foundation) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు ముచ్చింతాల్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన పాఠశాల విద్యార్థులు హజరయ్యారు.

Khammam:ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో(Sri Adarsha High School)పదో తరగతి చదువుతున్న జక్కుల నవనీత్ రాష్ట్రస్థాయి ప్రధమ బహుమతిగా నిలిచాడు.380 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో నవనీత్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం పట్ల చిన్నజీయర్​ స్వామి(Chinna Jeeyar Swamy)అభినందించారు.

శనివారం రాత్రి ముచ్చింతాల్(Muchintal)చిన్న జీయర్ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదగా నవనీత్ ఈ అవార్డును అందుకున్నాడు .

నవనీత్ కు ప్రశంసా పత్రంతో పాటు రూ.13వేల నగదు బహుమతిని చిన్న జీయర్ స్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర బాధ్యుడు యాదగిరి శేఖర్ రావు, పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్, ట్రస్మా రాష్ట్ర స్థాయి బాధ్యులు పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్