
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే IPL18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లు వారి హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. ఇందులో KKRతో RCB తలపడనుంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన SRH జట్టు సైతం తమ హోంగ్రౌండ్ ఉప్పల్‌లోనే తొలి మ్యాచ్‌ను ఆడనున్నట్లు పేర్కొంది. మార్చి 23న ఆదివారం RRతో SRH తలపడనున్నట్లు క్రిక్ బజ్(Cricbuzz) తెలిపింది.
ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్?
కాగా.. ఐపీఎల్ షెడ్యూల్(IPL Schedule) కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. BCCI ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల(Franchise)కు ముఖ్యమైన మ్యాచ్‌లకు సంబంధించిన తేదీల విషయాన్ని బోర్డు తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న KKR హోంగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో మే 25న జరగనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.
మరో రెండుమూడు రోజుల్లో పూర్తి షెడ్యూల్
క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫయర్ 2, గ్రాండ్ ఫైనల్ కోల్‌కతాలో జరుగుతాయి. ముంబైలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం తర్వాత BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajiv Shukla) ఐపీఎల్ 2025 మార్చి 23న ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే.. IPL 2025 సీజన్‌ను ఒక రోజు ముందు నిర్వహించాలని ప్రసారకులు అభ్యర్థించారు. దీంతో ఒక రోజు ముందుకు జరిపినట్లుగా క్రిక్ బజ్ నివేదిక(Cricbuzz Report) పేర్కొంది. ఐపీఎల్ పూర్తి మ్యాచ్‌ల షెడ్యూల్ రెండు రోజుల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.